సైనిక్ స్కూల్ కోరుకొండ విజయనగరం అడ్మిషన్,ఎగ్జామినేషన్,ట్యూషన్ ఫీజు,మరియు పూర్తి వివరాలు తెలుగులో

సైనిక్ స్కూల్ కోరుకొండ

విజయనగరం 

sainik school korukonda vijayanagaram
సైనిక్ స్కూల్ కోరుకొండ, విజయనగరం 
 సైనిక్ స్కూల్ అంటే అదో స్కూల్ మాత్రమే కాదు, ఒక సారి సైనిక్ స్కూల్ లో అడ్మిషన్ సాదిస్తే ఇక ఆ విద్యార్ది భావిష్యత్తు తిరుగు ఉండదు సైనిక్ స్కూల్ అంటే క్రమశిక్షణ,విద్యా విదానం,ఆరోగ్య భద్రత ఉన్నత స్థాయిలో ఉంటాయి కోరుకొండ ప్యాలెస్ ను 1911 వ సంవత్సరంలో పూసపాటి చిట్టిబాబు విజయరామ గజపతిరాజు నిర్మించాడు. విద్యార్థుల కొరకు ఒక ప్రత్యేక పాఠశాల నిర్మిస్తే బాగుంటుందన్న ఆలోచన తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకి కలిగింది. ఆ బాధ్యతను అప్పటి రక్షణ మంత్రి వి. కె. కృష్ణ మేనన్ పైన పెట్టాడు. అవిధంగా దేశవ్యాప్తంగా సైనిక పాఠశాలలు ప్రారంభమైనాయి.
sainik school korukonda
ఆగస్టు 15th , కోరుకొండ సైనిక్ స్కూల్ 


 ఆంధ్ర ప్రదేశ్లో సరైన ప్రాంగణం కొరకు అన్వేషణ మొదలైంది. విద్యాధికుడైన డా: పూసపాటి వెంకట గజపతిరాజుకి ఆ సంగతి తెలిసింది. విజయనగరానికి పదకొండు కిలోమీటర్ల దూరంలో వున్న తమ కోరుకొండ ప్యాలెస్ ను పాఠశాల కొరకు ఇవ్వడానికి ఆయన ముందుకొచ్చారు. 1961 సెప్టెంబరు 19 న ఆ అందమైన భవంతితో పాటు 206 ఎకరాల భూమిని కూడా దానంగా ఇచ్చేశాడు. 1961-62 వ సంవత్సరంలో ఆ పాఠశాల ప్రారంభమైంది. రక్షణ శాఖ ఆధ్వర్యంలో సైనిక పాఠశాలల సొసైటి పర్వవేక్షణ బాధ్యతలు చూస్తుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 24 సైనిక పాఠశాలలు ఉన్నాయి.
sainik school korukonda vijayanagaram
కోరుకొండ సైనిక్ స్కూల్ , విజయనగరం 
ఇక్కడ చేరడానికి ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణ సాధించాలి. ఇక్కడ ఆరవ తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు భోదిస్తారు. బాలురకు మాత్రమే ప్రవేశం. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెల మూడో ఆదివారం 6, 9 తరగతులకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. (గమనిక: పరీక్ష తేదీలు మరియు పద్ధతులు ప్రతి సంవత్సరం మార్పు జరగవచ్చు) పరీక్షలు అనంతపురం, ఏలూరు, గుంటూరు, తిరుపతి, హైదరాబాద్, రాజమండ్రి, విశాఖపట్టణం, విజయనగరం కేంద్రాల్లో నిర్వహిస్తారు.( పరీక్ష కేంద్రాలు మార్చే అవకాశం ఉంది ప్రతి నోటిఫికేషన్లో పరీక్ష కేంద్రాలు గమనించగలరు)
ఆరవ తరగతి ప్రవేశ పరీక్షకు మూడు పేపర్లుంటాయి. గణిత పరీక్షకు 100 మార్కులు 90 నిమిషాల్లో రాయాలి. భాషాసామర్ధ్య పరీక్షకు 100 మార్కులు 45 నిమిషాల్లో రాయాలి. అలాగే ఇంటలిజెంస్ పరీక్షలో మూడు విభాగాలకు 100 మార్కులుంటాయి. ఇవిగాక మౌఖిక పరీక్ష కూడా ఉంటుంది.
తొమ్మిదవ తరగతి పరీక్షకు నాలుగు పేపర్లు రాయాలి. గణితానికి 200 మార్కులు - 120 నిమిషాల వ్యవధి; సామాన్య జ్ఞానానికి 75 మార్కులు - 45 నిమిషాల వ్యవధి ఉంటుంది. మౌఖిక పరీక్షకూడా నిర్వహిస్తారు.
ఆరవ తరగతి పరీక్షను ఇంగ్లీషులోగాని, గుర్తించిన ఏ భారతీయ భాషలోగాని రాయవచ్చు. కానీ తొమ్మిదవ తరగతి పరీక్షలో ప్రశ్నాపత్రాలు ఇంగ్లీషులోనే వుంటాయి. సమాధానాలు ఇంగ్లీషులోగాని, గుర్తించిన ఏ భారతీయ భాషలోగాని రాయవచ్చును.
sainik school korukonda vijayanagaram
కోరుకొండ సైనిక్ స్కూల్ 

కోరుకొండ సైనిక్ స్కూల్ లో చదువుకొన్న ప్రముఖ పూర్వ విద్యార్దులు :
 • Lt Gen కె. ఆర్. రావు, Director General, Artillery; Indian Army
Lt Gen సురేంద్రనాథ్, General officer Commanding in Chief, ARTRAC (Army Training         Command), Shimla; Indian Army
దువ్వూరి సుబ్బారావు, Governor, Reserve Bank of India
Commodore సి. ఉదయ్ భాస్కర్, Indian Navy, Defence Analyst
ఎన్.ఎస్.ఆర్. చంద్రప్రసాద్, CMD, National Insurance Co Ltd
కె. విజయ భాస్కర్ - తెలుగు సినిమా దర్శకుడు
Wing Commander ఎం.కె. రెడ్డి, Tensing Norgay National Adventure Award Winner
మల్లి మస్తాన్ బాబు - పర్వతారోహకుడు. ప్రపంచంలోని ఏడు ఖండాలలోని అతిపెద్ద పర్వతాలను 171 రోజుల్లో అధిరోహించి గిన్నీస్ బుక్ లోకి ఎక్కాడు.
Capt. ఉదయ్ భాస్కర్ రావు - died on the Indian Army's Mount Everest expedition
Brig. వి.ఎస్. శ్రీనివాస్ - Commander ; 93 Inf Bde.
కె.ఎస్.ఆర్ చరణ్ రెడ్డి -IPS, Inspector General of Police -Internal Security ( Karnataka)
బి. చంద్రశేఖర్- IPS, Inspector General of Police- Punjab Cadre- Commandant NISA, Hyderabad

korukonda sainik school drill
కోరుకొండ సైనిక్ స్కూల్ డ్రిల్ 

Korukonda Sainik school, Vijayanagaram website link::
Thank you
Ramarao D